చెంపల అందాన్ని ఇనుమడింప చేయటం కోసం వాడే ప్రక్రియ బ్లషర్, మొహం మెరుపులో కీలకపాత్ర వహించే దీనిని సరిగ్గా చేయకపోతే మేకప్ కుదరదు. అందంగా కూడా కనిపించం. అందుకు మనమే చేయాలి ? -చెంపలు ప్రకాశవంతంగా కనిపించాలంటే లిప్ స్టిక్ రంగుకు సరిపడే విధంగా బ్లషర్ రంగును ఎంపిక చేసుకోవాలి. -పగటి పూట లేతరంగు, సాయంకాలం పార్టీలకు ముదురు రంగులో మెరిసిపోయే బ్లషర్ లను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఆ రెండింటిలో మీ చర్మ తత్వానికి ఏది సరిపోతుందో పరీక్షించుకుని తీసుకోవాలి.  -జిడ్డు చర్మం గలవారికి పౌడర్ బ్లషర్, పొడి చర్మంగలవారిక క్రీమ్ బ్లషర్ చక్కగా సరిపోతుంది. -పౌండేషన్ రాయడం, కంటిమేకప్ పూర్తయిన తర్వాతనే బ్లషర్ అద్దుకోవడం చేయాలి. -పౌడర్ బ్లషర్ వేస్తున్నట్లయితే మృదువైన బ్రిసిల్స్, గుండ్రటి ఆకారంలో ఉండే బ్రష్ మంచిది. అదనపు పౌడర్ ను సులువుగా తీయవచ్చు.  -అద్దం ముందు నిల్చుని చిరునవ్వు నవ్వండి. ఆ సమయంలో ముఖ కవలికలను నిశితంగా పరిశీలించుకోండి. నవ్వినప్పుడు చెంపలు ఏయే భాగంలో బాగా కనపడతాయో మిమ్మల్ని అందంగా చూపుతాయో గమనించి అక్కడ బ్లషర్ వేసుకోవాలి. - నవ్వినపుడు చెంపలు బాగా పైకి వెళ్తున్నట్లు అనిపిస్తే చూడగానే ఆకర్శించే విధంగా చెంపల మధ్యలో బ్లషర్ వేయవచ్చు. - ఒకవేళ జెల్ బ్లషర్ వేస్తున్నట్లయితే మధ్య వేలితో కొంచెం తీసి చెంపలకు రాయాలి. తర్వాత బ్రష్ తో సమంగా చేసుకోవచ్చు. జెట్ విషయంలో జాగ్రత్త. కొంచెం ఎక్కువైనా అలంకరణ ఎబ్బెట్టుగా మారుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: